ఖర్‌దుంగ్‌లా శిఖరం.. చిన్నారుల పాదాక్రాంతం
close

ప్రధానాంశాలు

ఖర్‌దుంగ్‌లా శిఖరం.. చిన్నారుల పాదాక్రాంతం

తాడిమర్రి, న్యూస్‌టుడే: పట్టుమని పదేళ్లు లేని చిన్నారులు గట్టి సాహసం చేశారు. లద్దాఖ్‌ ప్రాంతంలో 5,359 మీటర్ల ఎత్తైన ఖర్‌దుంగ్‌లా పర్వతాన్ని ఐదు రోజుల్లో అధిరోహించి రికార్డు సృష్టించారు. అనంతపురం జిల్లాకు చెందిన కడపల రిత్వికశ్రీ, కడపల భవ్యశ్రీ, సీల్ల యశశ్విత, కర్నూలు జిల్లాకు చెందిన గంధం సూర్య, గంధం భువన్‌ ఈనెల 15న లద్దాఖ్‌కు చేరుకొని 16న ఖర్‌దుంగ్‌లాకు పయనమయ్యారు. 21న శిఖరాన్ని అధిరోహించారు. రిత్వికశ్రీ వయసు తొమ్మిదేళ్లు కాగా మిగిలిన నలుగురి వయసు ఎనిమిదేళ్లే. రిత్వికశ్రీ, శంకర్‌ ఇప్పటికే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఈ చిన్నారుల బృందానికి ఆర్డీటీ క్రీడల ప్రోగ్రాం ఇన్‌ఛార్జి కడపల శంకర్‌, ఆర్డీటీ ఆసుపత్రి వైద్యుడు హేమచందర్‌ శిక్షకులుగా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలకు పేరొందిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) నిర్వహిస్తున్న ‘ఇండియా ఫర్‌ ఇండియా’లో భాగంగా ఈ సాహస కృత్యాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. జిల్లా గత కలెక్టర్‌ గంధం చంద్రుడు వీరికి సహకారం అందించినట్లు శంకర్‌ ‘ఈనాడు-ఈటీవీ’కి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని