రాజ్యసభ మాజీ సభ్యుడు ‘యడ్లపాటి’కి సతీ వియోగం

ప్రధానాంశాలు

రాజ్యసభ మాజీ సభ్యుడు ‘యడ్లపాటి’కి సతీ వియోగం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు సతీమణి అలివేలు మంగమ్మ(93) హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో కన్నుమూశారు. ఆమె సుమారు మూడు నెలల క్రితం స్నానాలగదిలో కాలుజారిపడ్డారు. అప్పటి నుంచి అల్లుడు డాక్టర్‌ నన్నపనేని సాయిరాం వద్ద ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు ఫోన్‌లో వెంకట్రావును పరామర్శించి సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయానికి హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని