విజయనగరం జిల్లాలోశారదా పీఠానికి భూ అన్వేషణ

ప్రధానాంశాలు

విజయనగరం జిల్లాలోశారదా పీఠానికి భూ అన్వేషణ

కొత్తవలస, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ వద్ద ఉన్న శారదా పీఠం కోసం విజయనగరం జిల్లాలోని  కొత్తవలస, భోగాపురం మండలాల్లో భూమిని అన్వేషిస్తున్నారు. సుమారు 15 ఎకరాలు అనువైన భూమిని పరిశీలించి నివేదించాలని సంబంధిత తహసీల్దార్లకు కలెక్టర్‌ సూచించినట్లు సమాచారం. కొత్తవలస మండలం దెందేరు రెవెన్యూలో సర్వే నంబరు 48లోని కొండ పోరంబోకు భూమిని పరిశీలించారు. గతంలో దీన్ని రవాణా అకాడమీకి పరిశీలించారు. ఇది కొందరు రైతుల ఆక్రమణలో ఉండటంతో నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అధికారుల సూచన మేరకు ఈ భూమిని శారదా పీఠం కోసం పరిశీలించి ప్రతిపాదనలు పంపినట్లు తహసీల్దారు ఎస్‌.రమణారావు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని