
తెలంగాణ
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం కోసం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా సమర్పించారు. కుటుంబ సమేతంగా యాదాద్రికి వచ్చిన ఆయన బాలాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ క్రతువులో భాగస్వామ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. క్షేత్రంలో రూ.2 కోట్లతో కాటేజీ నిర్మిస్తానని ప్రకటించారు.