Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
చెన్నైలో భారీ వర్షాలు

చెన్నై నగరంలో వరదనీటిలో చిక్కుకున్న కారు

ఈనాడు-చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చెన్నైని మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శివార్లలోని ఆలందూరు, పజవంతాంగల్‌, ఎయిర్‌పోర్టు, పల్లవరం, పెరంగళత్తూరు, క్రోంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయి. తాంబరంలో చాలామంది వరద నీటిలో చిక్కుకుపోయారు. అక్టోబరు 1 నుంచి నవంబరు 27 వరకు చెన్నైలో 119.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. 2015లో కురిసిన వర్షాల తర్వాత ఈ స్థాయి వర్షాలు ఇప్పుడే నమోదయ్యాయని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అప్పట్లో అక్టోబరు 1 నుంచి డిసెంబరు చివరివరకు 160 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తాజాగా డిసెంబరు మొదలవకముందే 119 సెం.మీటర్ల వర్షపాతం నమోదవడం గమనార్హం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్‌ పర్యటించి సహాయచర్యలను పర్యవేక్షించారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.