తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
40 ఏళ్లు దాటిన కార్మికులకు వైద్య పరీక్షలు

ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఏర్పాట్లు

కార్మిక రాజ్య బీమా పరిధిలోకి వచ్చే కార్మికులకు ఆరోగ్య రికార్డులు నిర్వహించాలని ఈఎస్‌ఐసీ నిర్ణయించింది. 40 ఏళ్లు నిండినవారందరికీ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనుంది. ఈ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేసి ఈ-ఆరోగ్య రికార్డులు సిద్ధం చేయనుంది. ఈమేరకు వార్షిక ముందస్తు ఆరోగ్యపరీక్షల విధానాన్ని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని ఈఎస్‌ఐసీ, బీమా వైద్యసేవల ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అర్హులైన కార్మికులందరూ ఈ సేవలు వినియోగించుకోవాలని కోరింది. రాష్ట్రంలో 63,510 కర్మాగారాలు, సంస్థల పరిధిలోని 17 లక్షలమంది ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నారు. వారి కుటుంబాల్లోని 75 లక్షలమందికి బీమా సౌకర్యం వర్తిస్తోంది. ఏటా 3.5 లక్షలమంది వైద్య చికిత్సలు, ఇతర ఆసుపత్రుల్లో వైద్యానికి రిఫరల్‌ విధానం ఉపయోగించుకుంటున్నారు.

ఎందుకీ పరీక్షలు?

బీమా పరిధిలోకి వచ్చే కార్మికులు కొందరు ప్రమాదకరమైన పరిశ్రమలు, వాతావరణంలో పనిచేస్తున్నారని, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ గుర్తించింది. సాధారణ వైద్యపరీక్షలు చేస్తున్నప్పటికీ, ఏడాదికోసారి ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ అవసరమని నిర్ణయించింది.

ఏ పరీక్షలు చేస్తారు?

రక్తం, మధుమేహం, మూత్రం, కాలేయం,  మూత్రపిండాల పనితీరు, ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ.

పరీక్ష చేశాక ఏంచేస్తారు?

ఏవైనా రుగ్మతల లక్షణాలు బయటపడితే కార్పొరేషన్‌ తరఫున వెంటనే ఔషధాల పంపిణీ చేయడంతో పాటు అత్యవసరమైతే చికిత్సలకు సిఫారసు చేస్తారు.

- ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.