తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
TSRTC: నూతనంగా 151 సర్వీసులు ప్రారంభించిన ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సంస్థ కొత్త సర్వీసులు, ట్రిప్పులతో ప్రజలకు మరింత చేరువైంది. వీసీ సజ్జనార్‌ ఆ సంస్థ ఎండీగా గత సెప్టెంబరు 3న బాధ్యతలు చేపట్టారు. వెంటనే సంస్థ పురోగతిపై దృష్టిసారించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇలా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు రాగా వాటిలో 364 పరిష్కరించారు. ప్రజలు, విద్యార్థులు, మహిళల నుంచి వచ్చిన వినతులను ప్రత్యేకంగా పరిశీలించిన సంస్థ 151 కొత్త సర్వీసులను ప్రారంభించింది. కొత్తవి, పునరుద్ధరించినవి కలిపి మొత్తం 510 సర్వీసులు మొదలయ్యాయి. 1934 కొత్త ట్రిప్పులతో ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ వ్యవధిలో రవాణా సేవల పునరుద్ధరణలో ఎండీ, అధికారులు, ఉద్యోగులు చూపిన నిబద్ధతను సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన ద్వారా అభినందించారు. సామాజిక మాధ్యమ ఖాతాలను పక్కాగా నిర్వహిస్తున్న సిబ్బందిని ఎండీ ప్రశంసించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.