
ఆంధ్రప్రదేశ్
సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ
ఈనాడు, అమరావతి: వరదలకు కడప జిల్లాలోని అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులు దెబ్బతినడంపై న్యాయవిచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్కు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం లేఖ రాశారు. ‘ఈ ప్రాజెక్టులు దెబ్బతినడం వెనుక ఇసుక మాఫియా ఉంది. అన్నమయ్య జలాశయంలో ఉన్న నీటిని ముందుగానే ఖాళీ చేసి ఉంటే విపత్తు వచ్చేది కాదు. ఈ రెండు జలాశయాల విషయంలో న్యాయవిచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.