
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: స్పిన్నింగ్, హేచరీస్ వ్యాపారాల నిర్వహణలో గుంటూరులో ప్రసిద్ధిగాంచిన సక్కు గ్రూప్ ఆఫ్ కంపెనీలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. విశాఖపట్నం నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇన్కంటాక్స్ విభాగం ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో వారికి చెందిన వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు చేశారు. వార్షిక రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలతో పాటు పలు రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.