
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విరాళం ఇచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డితో పాటు పలువురు అధికారులు సీఎంను కలిసి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమశాఖ ఏడీ వి.వెంకటరాజారావు, ప్లేస్మెంట్ అధికారి భక్తవత్సలరెడ్డి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.