
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఇప్పటివరకు ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాటి స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది పార్టీ ఏర్పాటు తరువాత పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను, రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియాతోపాటు పలు రకాల విభాగాలను ఏర్పాటు చేసి ఇన్ఛార్జులను నియమించారు. ప్రస్తుతం అన్ని కమిటీల రద్దు ప్రకటన పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
నూతన కోఆర్డినేటర్లు వీరే..
గ్రేటర్ హైదరాబాద్- వడుక రాజగోపాల్, ఉమ్మడి ఖమ్మం- గడిపల్లి కవిత, ఆదిలాబాద్- బెజ్జంకి అనిల్‌కుమార్, నిజామాబాద్- నీలం రమేష్, వరంగల్, హనుమకొండ- నాడెం శాంతికుమార్, వికారాబాద్- తమ్మాలి బాలరాజ్, జయశంకర్ భూపాలపల్లి- అప్పం కిషన్, నల్గొండ- ఇంజం నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరి- మహమ్మద్ అత్తార్‌ఖాన్, ములుగు- రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి- ఎడమ మోహన్‌రెడ్డి, నారాయణపేట- మడివాల కృష్ణ