Srisailam: శ్రీశైలంలో 5 గేట్ల నుంచి నీటి విడుదల

3 రోజుల్లో తెరుచుకోనున్న సాగర్‌ గేట్లు
565.50 అడుగుల వద్ద జలాశయం

శ్రీశైలం ప్రాజెక్టు (మన్ననూర్‌), న్యూస్‌టుడే; ఈనాడు, హైదరాబాద్‌ : శ్రీశైలం ప్రాజెక్టులో శుక్రవారం అయిదు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టులు జూరాల, హంద్రీ, రోజా నుంచి ప్రాజెక్టుకు 2,26,776 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఔట్‌ ఫ్లో 2,28,079 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 884.70 అడుగులకు చేరింది. ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి నుంచి 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అయిదు యూనిట్లలో 10.544 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశామని జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784, ఏపీ విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,112 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

నిండుకుండలా మారుతున్న నాగార్జునసాగర్‌

నాగార్జునసాగర్‌ నిండు కుండలా మారుతోంది. మూడు రోజుల్లో జలాశయం గేట్లు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను శుక్రవారం సాయంత్రానికి 565.60 అడుగులకు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 245.34 టీఎంసీలకు చేరుకుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని