సంక్షిప్త వార్తలు (3)

రేపల్లె డివిజన్‌పై తుది నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, అమరావతి: బాపట్ల జిల్లాలో రేపల్లెను డివిజన్‌ కేంద్రంగా గుర్తిస్తూ తుది నోటిఫికేషన్‌ వెలువడింది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఈ డివిజన్‌ పరిధిలోకి 9 మండలాలను చేర్చారు. వీటిలో రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, అమర్తలూరు, చుండూరు, నగరం మండలాలు ఉన్నాయి.


8 నుంచి పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 1,836 గ్రామ సచివాలయాల పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి.


పిడుగుపాటుకు మహిళ మృతి

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన కోమటినేని ప్రమీల (40) శుక్రవారం పిడుగుపాటుకు మృతి చెందారు. వర్షపు నీటిని పొలం నుంచి బయటకు పంపే పనిలో ఉండగా పిడుగు పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని