లంచాలు తీసుకోవడమే మీరు చేస్తున్న ఘన కార్యమా?

సచివాలయ ఉద్యోగులపై మండలాధ్యక్షుడి ఆగ్రహం

కనిగిరి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ జీతాలు పెంచి ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తే.. ప్రతి పనికి లంచాలు తీసుకోవడమే మీరు చేస్తున్న ఘన కార్యమా? అని సచివాలయ ఉద్యోగులపై ప్రకాశం జిల్లా కనిగిరి మండలాధ్యక్షుడు దంతులూరి ప్రకాశం మండిపడ్డారు. లంచాలు తీసుకునే వారి పేర్లు ఏసీబీకి చెప్పి పట్టిస్తానని ఆగ్రహించారు. మండలంలో ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహణలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలే కాకుండా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కూడా ఫిర్యాదులు చేస్తున్నారంటే మీ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందని మండలాధ్యక్షుడు అన్నారు. ప్రతిపక్ష పార్టీ వారికంటే అధికార పార్టీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారని ఆరోపించారు.  మీరిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌కు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు ఓట్లు ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేశారు. కనిగిరి మండలంలోని చాలామంది వాలంటీర్లు తమ మాట వినడం లేదని కొందరు సచివాలయ ఉద్యోగులు ఎంపీపీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి రాకుండా వ్యాపారాలు చేసుకుంటూ గౌరవ వేతనం తీసుకుని వెళుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జె.మల్లికార్జునరావు, ఎంఈవో జె.ప్రసాదరావు, ఈవోఆర్డీ అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని