ఖరీఫ్‌ సాగు.. కలవరమే

2021 ఆగస్టు 10 నాటితో పోలిస్తే.. 15 లక్షల ఎకరాలు తక్కువ సాగు

ఈనాడు, అమరావతి: గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలవుతున్నాయి. అయినా ఖరీఫ్‌ సాగు చూస్తే కలవరమే. ఆరంభంనుంచి ఇప్పటివరకు మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వర్షపాతం సాధారణంగానే ఉన్నా 2021 ఆగస్టు 10నాటికి సాగైన విస్తీర్ణంతో పోలిస్తే 15 లక్షల ఎకరాలు తగ్గింది. ఇందులో వరి విస్తీర్ణమే అధికం. వేరుసెనగ, కంది పరిస్థితి ఇంతే. జూన్‌, జులైలో వర్షాలు అనుకూలించకపోవడంతో రాయలసీమలో వేరుసెనగతోపాటు ఇతర పంటలు వేయలేకపోయారు. జూన్‌ నెలలో 198 మండలాలు, జులైలో 118 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. ఖరీఫ్‌ సాగులో మూడేళ్లుగా పెరుగుతున్న నష్టాలతో సాహసించి ముందుకు సాగలేని పరిస్థితి దీనికి మరో కారణం. గోదావరి జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతోపాటు ముంపు భయం కూడా వరి నాట్లకు ప్రతిబంధకంగా మారింది.

* గతేడాది ఆగస్టు 10 నాటికి సాగైన విస్తీర్ణంతో పోలిస్తే.. వరి సాగు అత్యధికంగా 7.10 లక్షల ఎకరాలు తగ్గింది. మొత్తంగా చూస్తే ఆహారధాన్యాల పంటలను గతేడాది ఇదే సమయానికి 38.30 లక్షల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది 27.20 లక్షల ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని