ప్రశాంతంగా సైనిక నియామకాలు

స్టేడియంలోకి అభ్యర్థులకు మాత్రమే అనుమతి

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ, జగదాంబ కూడలి), న్యూస్‌టుడే: విశాఖలో అగ్నిపథ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఎంపికలు మొదటి రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 31 వరకు ఈ ఎంపికలు జరగనున్నాయి. తెల్లవారుజాము నుంచి స్టేడియంలోకి అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. మిగిలిన వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంపికలు చేపడుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. అర్ధరాత్రి నుంచే అనుమతిస్తామని చెప్పటంతో ముందుగానే యువత స్టేడియానికి చేరుకున్నారు. కొద్దిపాటి గెడ్డం ఉన్నా అనుమతించకపోవడంతో అభ్యర్థులు సెలూన్ల వద్ద బారులు తీరారు.


మరిన్ని

ap-districts
ts-districts