
Edible Oil Prices: గుడ్‌న్యూస్.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు
దిల్లీ: నిత్యావసరాల ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి ఊరట కలిగించే వార్త ఇది. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు తయారీ సంస్థలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు కాస్త దిగొచ్చిన నేపథ్యంలో దేశీయంగానూ వీటి ధరలను తగ్గించేందుకు తయారీ సంస్థలు ఈ సమావేశంలో అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. త్వరలోనే వంటనూనె ధరలు రూ.10 నుంచి రూ.12 వరకూ తగ్గే అవకాశాలున్నాయని సదరు వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.
ఇటీవల ఫార్చూన్ బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్ కంపెనీ నూనె ధరలను రూ.30 వరకూ తగ్గించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని ఇటీవల కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గిస్తున్నట్లు అదానీ విల్మర్ కంపెనీ ప్రకటించింది. అయితే అంతర్జాతీయంగా వంట నూనె ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో ధరల తగ్గింపుపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సూచించగా.. అందుకు తయారీ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో వంట నూనె ధరలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దేశీయంగా లీటర్ నూనె ధర రూ.200 దాటేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లో వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టాయి.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
- శృంగారానికి పురుషుడి అవసరం లేదు
- Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
- Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
- Free mobile: స్మార్ట్‌ఫోన్ ఫ్రీ.. మూడేళ్లు ఇంటర్నెట్ ఫ్రీ.. ఆ రాష్ట్ర సర్కార్ కొత్త స్కీమ్!