నవ్వుల్‌.. నవ్వుల్‌..!

సెలవు పోతుంది కదా!

టీచర్‌ : చింటూ.. ‘దురదృష్టం’ అంటే ఏంటో చెప్పు?
చింటు : ఆదివారం పండగ రావడం టీచర్‌..

టీచర్‌ : అది కాకుండా ఇంకొకటి చెప్పు?
చింటు : ఆదివారం జ్వరం రావడం టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

పెద్ద లక్ష్యమే..

అంకుల్‌ : లహరీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
లహరి : రచయిత అవుతా అంకుల్‌..

అంకుల్‌ : వెరీ గుడ్‌.. ఇంతకీ ఏం రాస్తావు?
లహరి : వారానికి మూడు రోజులు బడికి సెలవిచ్చేలా, ఐస్‌క్రీములు ఉచితంగా పంచిపెట్టేలా, పరీక్షలనేవే లేకుండా పిల్లల కోసం రాజ్యాంగం రాస్తా అంకుల్‌..

అలా అర్థమైందా?

టీచర్‌ : పిల్లలూ.. ‘బతకనేర్చిన వాడు’ అని ఎవరిని అంటారో తెలుసా?
హరి : నాకు తెలుసు టీచర్‌..

టీచర్‌ : ఎవరో చెప్పు?
హరి : మా తాతయ్యను టీచర్‌..

టీచర్‌ : అదేంటి?
హరి : అవును టీచర్‌.. మా తాతయ్య మొన్ననే 105వ పుట్టినరోజు జరుపుకొన్నాడు మరి..

టీచర్‌ : ఆ..!!


మరిన్ని

ap-districts
ts-districts