ప్రధాని నివాసం వద్ద కదల్లేని స్థితిలో గద్ద!

డీహైడ్రేషన్‌తో పడిపోయిన పక్షి

సంరక్షించిన వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌

దిల్లీ: నీళ్లందక అలమటిస్తూ ఎగరలేని స్థితిలో పడిఉన్న ఓ గద్దను దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం వద్ద భద్రతా సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణ సంస్థ (వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌)కు సమాచారం అందించారు. దీంతో సంస్థకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం చేరుకుని ఆ పక్షిని సంరక్షించింది. డీహైడ్రేషన్‌ కారణంగా గ్రౌండ్‌పై అది కదల్లేనిస్థితిలో ఉండిపోయినట్లు గుర్తించి, దానికి నీళ్లందించారు. అనంతరం సంరక్షణ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఆ గద్దను పరిశీలనలో ఉంచామని, పూర్తిగా కోలుకున్న తర్వాత అటవీప్రాంతంలో విడిచిపెడతామని ఆ సంస్థ తెలిపింది. దిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో ఇలాంటి గద్దల సంరక్షణకు సంబంధించిన అనేక కాల్స్‌ తమకు వస్తున్నట్లు వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ వెల్లడించింది. సాధారణంగా నీళ్లందక, డీహైడ్రేషన్‌కు గురై ఆ పక్షులు పడిపోతున్నట్లు సంస్థ కార్యదర్శి గీతా శేషమణి తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని