అత్యాచార దోషులకు పూలమాలలా?

త్యాచారానికి పాల్పడిన దోషులకు పూలమాలలు వేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. ఇది నైతిక పతనం మాత్రమే కాదు.. భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా అవమానకరమైన విషయం. మనం ఎటువైపు పయనిస్తున్నాం?      

- కౌశిక్‌ బసు


బానిసత్వాన్ని రూపుమాపుదాం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో సంకల్పించిన అయిదు ప్రమాణాల్లో ఒకటి.. అన్నిరకాల బానిసత్వ మూలాలను తుడిచిపెట్టేయడం. ఇదో చారిత్రక తీర్మానం. దీన్ని సాకారం చేసేందుకు మనం ప్రతినబూనాలి. బాలలను కార్మికులుగా వినియోగించడం, బాల్య వివాహాలు, చిన్నారుల అక్రమ రవాణా, పిల్లలతో వ్యభిచారం చేయించడం లాంటి అత్యంత దారుణమైన బానిసత్వ రూపాలకు ముగింపు పలకాలి.

- కైలాశ్‌ సత్యార్థి


స్కాట్లాండ్‌ విధానాన్ని భారత్‌ పాటించాలి

రుతుస్రావ సమయంలో ఎలాంటి ఇబ్బందులకు, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఉండటం మహిళల ప్రాథమిక హక్కు. పీరియడ్స్‌ వేళ అవసరమయ్యే వస్తువులన్నింటినీ ఉచితంగా అందించేలా నిర్ణయం తీసుకున్న తొలి దేశం స్కాట్లాండ్‌కు అభినందనలు. భారత్‌ కూడా ఆ విధానాన్ని అమలు చేయాలి.

- మహువా మొయిత్రా


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని