త్రివర్ణశోభితం

జాతీయ జెండాలతో 6 కోట్ల సెల్ఫీలు..

దిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ జెండాతో తీసుకున్న సెల్ఫీలు (స్వీయ చిత్రాలు) 6 కోట్లకు పైగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఈమేరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయడానికి యావత్తు దేశం కలిసి వచ్చిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సాధించిన మైలురాళ్లను ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ వివరించింది. ఇళ్ల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేస్తూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ జులై 22న పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌కు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న సాంస్కృతిక శాఖ కూడా జాతీయ పతాకాలతో తీసుకున్న సెల్ఫీలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కోరింది. వీటికి భారీగా స్పందన లభించింది. ఈమేరకు దేశ పౌరులకు మంత్రి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని