Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. జేఈఈ మెయిన్‌ ఫలితాలెప్పుడు?

జేఈఈ మెయిన్‌ ర్యాంకులను శనివారం రాత్రి ప్రకటిస్తారా?...ఆదివారం ఉదయం ప్రకటిస్తారా?అని దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు  ఎదురుచూస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది  ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏప్రిల్‌ 14న ఐఐటీ బాంబే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్ని ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెల్లడించాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇంటి వద్దకు కాదు.. వీధిలోకే..!

2. ప్రజలపై చెత్త భారం

జిల్లాలోని పురపాలక ప్రజలపై యూజర్‌ ఛార్జీల భారం నెలకొంది. ఒక్కోచోట ఒకలా వసూలు చేస్తున్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి రూ.30కి బదులు రూ.50 వరకు స్వచ్ఛ వాహనాల సిబ్బంది రాబట్టుకుంటున్నారు. ఓ వైపు ‘స్వచ్ఛ’ కోటాలో పురపాలకాలకు రూ.లక్షల్లో నిధులు మంజూరవుతున్నా మాపై ఏటేటా భారం పెంచుతూ పోవడం ఏమిటని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులో వేల కుటుంబాలపై రూ.కోట్లలో ఛార్జీలు మోపడం విమర్శలకు దారితీస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రెండిళ్లు.. 20 రోజులు.. కరెంటు బిల్లు రూ.1,75,706

నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రెండు ఇళ్లకు ఏకంగా రూ.1,75,706ల కరెంట్‌ బిల్లులు రావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రానికి చెందిన నల్లవెళ్లి పుల్లయ్య ఇంటికి గత నెల 16 నుంచి ఈ నెల 5 వరకు 8672 యూనిట్లు రీడింగ్‌ తిరిగినట్లు రూ.87,338 బిల్లు వేశారు. నల్లవెళ్లి నిరంజన్‌ ఇంటికి 20 రోజులకు 8793 యూనిట్లు తిరిగినట్లు రూ.88,368 బిల్లు వేశారు. రెండు బల్బులు, ఒక ఫ్యాన్‌ ఉండగా రూ.వేలల్లో బిల్లులు ఎలా వేస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బాలికపై హత్యాయత్నం ఘటనలో గ్రామ వాలంటీరు?

4. సై అంటే సై

అభివృద్ధిపై చర్చ హుజూరాబాద్‌ను అట్టుడికించింది. హోరాహరీ నినాదాలతో అంబేడ్కర్‌ చౌరస్తా మారుమోగింది.  శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెరాసకు చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాలు విసిరారు. బహిరంగ చర్చకు రావాలనేలా తేదీని, సమయాన్ని ఖరారు చేసి శుక్రవారం తాను తన శ్రేణులతో వస్తానని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘హద్దు’ల్లేని ఆక్రమణలు

ఓరుగల్లూ.. ఓరుగల్లూ వాన కురవగానే నువ్వెందుకు  మునిగిపోతున్నావు? వరదలు నాపైకి పోటెత్తితే మునిగిపోనా మరి.. వరదా వరదా నువ్వెందుకు పోటెత్తుతున్నావు అంటే.. చెరువు నిండి బయటకెళ్లే సరైన దారి లేక అంది. చెరువు చెరువూ దారెందుకు ఇవ్వడం లేదు అని అడిగితే.. వరద వెళ్లే మార్గంలో అక్రమ కట్టడాలు కడితే దారెలా ఇస్తానని తన గోడు వెళ్లబోసుకుంది. ఓరుగల్లులో వరదలకు కారణం ఏమిటని వెతికితే ఏటికేడు ఆక్రమణకు గురవుతున్న చెరువు శిఖం భూములే కనిపిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వణికిస్తున్న వంతెనలు

6. ఇంటి ముంగిటకే వైద్యసేవలు

గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల్లో ఇకపై వారానికి రెండుసార్లు వైద్యుడు ఓపీ చూడడంతోపాటు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చేతులు తడిపితేనే ప్యాకేజీ!

పోలవరం పునరావాసంలో 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు వచ్చే సెప్టెంబరు నెలాఖరులోగా ప్యాకేజీ చెల్లిస్తామని చెబుతున్న నేపథ్యంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కాంటూరు పరిధిలోని గ్రామాల్లో దళారులు రంగప్రవేశం చేశారు. ముందుగా  పరిహారం ఖాతాల్లో జమ కావాలంటే రూ.5 వేలు చెల్లించాలనే ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఇస్తే ఏమౌతుందో, ఇవ్వకపోతే పరిహారం పోతుందేమో అన్న సందిగ్ధంతో నిర్వాసితులు కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

క్షణ క్షణం.. భయం భయం

8. రూ. లక్షల్లో పెట్టుబడి.. రైతన్న కంటతడి

పంట చేతికొచ్చే తరుణంలో ఒక్కసారిగా ధర కుప్పకూలింది. రైతుకు ట‘మాట’ పడిపోయింది. భారీగా పెట్టుబడి పెట్టి.. ఎన్నో ఆశలతో సాగువేసిన టమోటా చేతికొచ్చే సమయంలో ధర పతనమవడంతో విలవిల్లాడిపోతున్నారు. మూడు నెలల కిందట కిలో టమోటా రూ.100 పలకగా.. నేడు 15 కిలోల బాక్సు రూ.30, రూ.40 మాత్రమే పలుకుతోంది. మూడు నెలల కిందట అత్యధిక ధరలు పలకడంతో రైతులను ఎంతో ఊరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సివిల్స్‌లో గెలిచి.. ఐపీఎస్‌గా మెరిసి

ఇంజినీరుగా స్థిరపడాలన్న ఉద్దేశంతో ఎంటెక్‌ పూర్తిచేసిన యువకుడు.. తన నిర్ణయం మార్చుకుని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా సొంతంగా సన్నద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలో 539వ ర్యాంకు రావడంతో ప్రస్తుతం చెన్నైలో అసిస్టెంట్‌ డీజీఎఫ్టీగా పనిచేస్తున్నారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే మళ్లీ సివిల్స్‌ రాశారు. మే నెలలో ప్రకటించిన ఫలితాల్లో 469వ ర్యాంకు సాధించి.. ఐపీఎస్‌ శిక్షణకు ఎంపికయ్యారు నంద్యాలకు చెందిన శశిశేఖర్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ అబ్బాయి చాలా మంచోడు

10. ఆర్టీసీ.. గొయ్యో మొర్రో..

అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని.. అధ్వాన రహదారులు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. గుంతల దారుల్లో రాకపోకల్లో ప్రతిబంధకాలు, ప్రమాదాలు ఇబ్బందిగా మారాయి. బస్సుల నిర్వహణ భారం సంస్థపై తీవ్రంగా పడుతోంది. దెబ్బతిన్న దారుల్లో ప్రభుత్వ వాహనమైనా.. ప్రైవేటు వాహనమైనా కష్ట- నష్టాల ప్రయాణం తప్పడం లేదు. వాహనాల నిర్వహణకే అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. వర్షాలు, వరదలకు రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణం దినదిన గండంలా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని