Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్ రాజీనామా
బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్.. ఎన్డీయేతో కూటమి బంధానికి ముగింపు పలికారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఈ మేరకు నేడు గవర్నర్‌ ఫాగు చౌహన్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. త్వరలోనే ఆయన ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

2. జయసుధ భాజపాలో చేరుతున్నారా?
ప్రముఖ సినీనటి జయసుధ భాజపాలో చేరనున్నారంటూ గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పార్టీలో చేరిక అంశంపై తెలంగాణ భాజపాకు చెందిన కొంతమంది నేతలు కూడా ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈనెల 21న మునుగోడులో జరిగే సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో జయసుధ భాజపాలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు.

3. గ్యాస్‌ ధరలు తగ్గించిన పార్టీకే ఓటేస్తాం..
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. తాళ్లసింగారం గ్రామస్థులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు గ్రామస్థులు కొన్ని సమస్యలను బండి సంజయ్‌ దృష్టికి తీసుకొచ్చారు..

4. నీరజ్‌ చోప్రా ఒలింపిక్స్‌ గోల్డ్‌..
బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టిన  భారత అథ్లెట్లు ఎల్దోస్ పాల్, సందీప్ కుమార్, అవినాష్ సాబ్లే లకు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారత అథ్లెటిక్స్ బృందం ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం ఎనిమిది పతకాలు సాధించి కామన్వెల్త్‌ క్రీడల్లో విజయవంతం అయ్యారు. భారత్‌కు చేరుకొన్నాక లాంగ్‌ జంప్‌లో స్వర్ణ పతక విజేత ఎల్దోస్ పాల్  మీడియాతో మాట్లాడుతూ..

5. BSNL నుంచి లాంగ్‌ప్లాన్‌.. ఒక్కసారి రీఛార్జి చేస్తే..
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీర్ఘకాలం వ్యాలిడిటీ కోరుకునే వారికోసం పరిమితకాలపు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ.2022 ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జి చేసుకుంటే 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్ని సర్కిళ్లకూ ఈ ప్లాన్‌ వర్తిస్తుందని BSNL పేర్కొంది. ఆగస్టు 31 వరకు మాత్రమే ప్లాన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

6. ఆయన చిత్రాల్ని నేను రీమేక్‌ చేస్తే ఎదురుదెబ్బే: చిరంజీవి
బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ సినిమాల్ని రీమేక్‌ చేసే ప్రయత్నం చేస్తే తనకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు చిరంజీవి. ఆమిర్‌ హీరోగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’. టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకానున్న నేపథ్యంలో ఆమిర్‌, నాగ చైతన్య, చిరంజీవిని నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివీ..

7. లాలూ ఉంటేనే బిహార్‌ నడుస్తుంది..!
బిహార్‌ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. తన రాజకీయ మనుగడకు భాజపా నుంచి ముప్పు పొంచి ఉందని భావించిన సీఎం, జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌.. ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆర్జేడీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే..

8. ఐటీఆర్‌ ఫైలింగ్‌లో త‌ప్పులా? ఇప్పుడేం చేయాలి?
గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఆడిట్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా ఐటీఆర్ దాఖ‌లు (ITR filing) చేసేందుకు వీలున్న ఖాతాల రిట‌ర్నుల దాఖ‌లు గ‌డువు జులై 31తో ముగిసింది. ఒక‌వేళ ఇప్ప‌టికీ ఐటీఆర్ ఫైల్ చేయ‌క‌పోతే అప‌రాధ రుసుము చెల్లించి ఈ ఏడాది డిసెంబ‌రు 31లోపు ఆల‌స్య‌పు ఐటీఆర్ (Belated ITR) దాఖ‌లు చేయ‌వ‌చ్చు. గ‌డువులోపు రిట‌ర్నులు దాఖ‌లు చేసిన..

9. సియోల్‌లో కుంభవృష్టి.. ఎనిమిది మంది మృతి
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి ఇక్కడ కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు నీటమునిగిపోయాయి.

10. ఈ బల్లెం వీరుల అనుబంధానికి బంగారు పతకం ఇవ్వాలి..
కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు స్వర్ణం అందించాడు అర్షద్‌ నదీమ్. ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 90.18 మీటర్లు విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం గెలవగా.. జావెలిన్ త్రోలో పాక్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దీనిపై భారత స్టార్‌ ఆటగాడు నీరజ్ చోప్రా స్పందిస్తూ..


మరిన్ని

ap-districts
ts-districts