Khammam: మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు దారుణహత్య

ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో బైక్‌పై ఆయన వెళ్తుండగా దుండగులు ఆటోతో ఢీకొట్టారు. అనంతరం ఆరుగురు కృష్ణయ్యపై వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ ఘటన జరిగింది. కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. 

మరోవైపు కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్తులు ఆరోపించారు. కోటేశ్వరరావు ఇంటిపై వారంతా దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. 


మరిన్ని

ap-districts
ts-districts