Telugu Movies: ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. థియేటర్‌-ఓటీటీ దద్దరిల్లిపోతాయ్‌!

Telugu Movies: ‘ఈ దసరా నిరుడు లెక్క ఉండదీ.. జమ్మివెట్టి చెప్తాన్నా.. బద్దల్ బాసింగలయ్‌తయ్.. ఎట్లైతేగట్లాయె.. చూసుకుందాం’.. ‘దసరా’ టీజర్‌లో నాని చెప్పిన డైలాగ్‌ ఈ దసరాకు సరిగ్గా సరిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ వారం ఇవ్వనుంది. అటు థియేటర్‌.. ఇటు ఓటీటీలో అదిరిపోయే చిత్రాలు వస్తున్నాయి. అవేంటో చూసేయండి...!

‘కింగ్‌ మేకర్‌’ ఈ గాడ్‌ఫాదర్‌..

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా చిరంజీవి నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో అలాంటి అంశాలన్నీ మేళవించి మోహన్‌రాజా ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేసి, తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.


శత్రువుల పాలిట ‘ఘోస్ట్‌’

ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నాయంటే చిత్ర పరిశ్రమకు అంతకన్నా పెద్ద పండగ ఏమీ ఉండదు. ‘గాడ్‌ఫాదర్‌’తో కలిసి నేనూ వస్తున్నానని అంటున్నారు నాగార్జున (Nagarjuna). ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ఘోస్ట్‌’ (The Ghost) . సోనాల్‌ చౌహాన్‌, గుల్‌పనాగ్‌ కీలక పాత్రలు పోషించారు. నాగార్జున ఇందులో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా పూర్తిస్థాయి యాక్షన్‌ హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం కూడా అక్టోబరు 5న థియేటర్‌లలో విడుదల కానుంది.


అటు చిరు.. ఇటు నాగ్‌.. మధ్యలో చిన్న హీరో

ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు వస్తుంటే మరో చిత్రం రావడానికి కాస్త ఆలోచిస్తారు. కానీ, నేనూ ‘సై’ అంటున్నారు యువ కథానాయకుడు గణేష్‌ (Ganesh). వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) జంటగా ఆయన నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam). లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. నరేష్‌, రావు రమేష్‌, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌

చిన్న చిత్రాలుగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి ‘కార్తికేయ2’, ‘బింబిసార’. ఇప్పుడు దసరా కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా, చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా అక్టోబరు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) కెరీర్‌లో విభిన్న చిత్రంగా ప్రశంసలు అందుకుంది ‘బింబిసార’ (Bimbisara). వశిష్ట తెరకెక్కించిన ఈ టైమ్‌ ట్రావెల్‌మూవీ మాస్‌తో పాటు క్లాస్‌ను మెప్పించింది. అక్టోబరు 7న ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.(అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)


నెట్‌ఫ్లిక్స్‌

* రంగరంగ వైభవంగా (తెలుగు) ఇప్పటికే స్ట్రీమింగ్‌ మొదలైంది


అమెజాన్‌ ప్రైమ్‌

* మజా మా (హిందీ) అక్టోబరు 6


జీ5

* రక్షాబంధన్‌ (హిందీ) అక్టోబరు 5

* గాలి పటా2 (కన్నడ) అక్టోబరు 5


డిస్నీ+హాట్‌స్టార్‌

* ఎక్స్‌పోజ్‌డ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 6

* ప్రే (హాలీవుడ్‌) అక్టోబరు 7


ఆహా

* దర్జా (తెలుగు) అక్టోబరు 5

* ఉనికి (తెలుగు)అక్టోబరు 5


లయన్స్‌ గేట్‌ప్లే

* ఫీల్స్‌ లైక్‌ హోం (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 7


సోనీలివ్‌

* ఈషో (మలయాళం/తెలుగు) అక్టోబరు 5మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు