rishabh pant: పంత్‌ పుట్టిన రోజున ప్రేయసి పోస్ట్‌!

దిల్లీ: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ మంగళవారం తన 25వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్బంగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, క్రికెటర్ల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి ప్రేయసి ఇషా నేగి ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేసింది. పంత్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియతమా’ అంటూ క్యాప్షన్‌ రాసి లవ్‌ సింబల్‌ను జత చేసింది. 

కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ యువ ఆటగాడి సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌కు చెందిన ఇషా బీఏ ఆనర్స్‌ పూర్తి చేసింది. ఇంటీరియర్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగాల్లో పనిచేస్తోంది. ప్రస్తుతం మోడల్‌గానూ రాణిస్తోంది. క్రికెట్‌కు వీరాభిమాని అయిన ఈ చిన్నది తనకు ఇష్టమైన ఆటగాడు మాత్రం విరాట్‌ కోహ్లీనే అని తెలిపింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు