
HIT 2: ‘హిట్’ ప్రపంచంలో కీలకం ‘హిట్2’
‘హిట్2’తో (HIT 2) థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు అడివి శేష్ (Adivi Sesh). ‘హిట్’కు కొనసాగింపుగా శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రమిది. ప్రశాంతి త్రిపిరనేని నిర్మాత. మీనాక్షి చౌదరి కథానాయిక. నాని సమర్పిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘పెద్ద తెరపై ట్రైలర్ చూశాక.. సినిమాపై చాలా నమ్మకం వచ్చింది. ముందుగా తెలుగు వెర్షన్ విడుదలవుతుంది. ‘హిట్’ యూనివర్స్‌లో నుంచి వస్తున్న రెండో చిత్రమిది. చాలా కీలకమైనది. తొలి భాగంతో పోల్చితే ఈ ‘హిట్2’ చాలా పెద్ద సినిమా. ‘హిట్3’ ఈ ‘హిట్2’ కన్నా ఇంకా పెద్ద సినిమా. ఈ మూడో భాగంలోనూ నేను ఉంటాను. త్వరలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నా’’ అన్నారు. దర్శకుడు శైలేష్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చివర్లో ఓ అమ్మాయిని ముక్కలుగా ఎందుకు చూపించారని చాలా మంది అడిగారు. సినిమా కథ ఆ హత్య చుట్టూనే తిరుగుతుంది. మరి దాని వెనకున్న పూర్తి కథేంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ మాగంటి, పావని పాల్గొన్నారు.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!