
లింగాయత్‌ల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన
వీరిని ఓబీసీలో చేర్చేందుకు కిషన్‌రెడ్డి కృషిచేయాలి: హరీశ్‌రావు
నార్సింగి న్యూస్‌టుడే: సాగు, తాగు నీరు.. రోడ్లు, విద్యుత్ వంటి అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. కోకాపేటలో రూ.10 కోట్లతో చేపట్టనున్న లింగాయత్‌ల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు మహమూద్ ఆలీ, సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి హరీశ్‌రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్ల కోసం లింగాయత్‌లు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందేనన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలన్నారు. ఎంపీ బీబీ పాటిల్ సీఎంకు విజ్ఞప్తి చేసిన వెంటనే ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంతో పాటు బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, నరేందర్‌రెడ్డి, హనుమంతు షిండే పాల్గొన్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత