రాజస్థాన్‌లో పశువుల సంతలపై నిషేధం

లంపీ వ్యాధి కట్టడికి చర్యలు

జైపుర్‌: పశువుల్లో సోకే లంపీ చర్మవ్యాధి రాజస్థాన్‌లో విజృంభిస్తోంది. అధిక సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధించింది. రాజస్థాన్‌లో ఇంతవరకు 2.80 లక్షలకు పైగా పశువులు ఈ వ్యాధి బారిన పడినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 12 వేలకు పైగా మూగజీవాలు మృతిచెందినట్లు వెల్లడించాయి. విస్తృత స్థాయిలో చికిత్సలు అందిస్తున్న నేపథ్యంలో పరిస్థితి అదుపులోనే ఉందని రాజస్థాన్‌ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి వెల్లడించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని