close

ఈనాడు ప్రత్యేకం

మైనర్ల హింసా మేజరే!

మహిళలపై అధికమవుతున్న వేధింపులు, అత్యాచారాలు
హత్యలు, హత్యాయత్నాల్లోనూ వారి పాత్ర

ఈనాడు, అమరావతి: విపరీత ప్రవర్తనతో చట్టంతో విభేదిస్తూ మైనర్లు హింసకు తెగబడుతున్నారు. లైంగిక దాడులకు సైతం తెగబడటం వంటివి కలవరం కలిగిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఆవేశానికి లోనై ఎదుటి వ్యక్తులపై దాడులు, హత్య వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు జువెనైల్స్‌ పాల్పడే నేరాల్లో ప్రధానంగా దొంగతనాలే ఉండేవి. కొన్నేళ్లుగా చూస్తే హింసాత్మక నేరాల్లోనూ వారి ప్రధాన పాత్ర ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2017లో జరిగిన నేరాలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన గణాంకాలు విశ్లేషిస్తే ఈ విషయం వెల్లడవుతుంది.

* వారంతా మైనర్లే.. కానీ మహా ముదుర్లు. మహిళలను వేధించటమే కాదు.. వారిపై అత్యాచారాలకూ తెగబడుతున్నారు. హత్యలు, హత్యాయత్నాలు వంటి హింసాత్మక నేరాలకు సైతం వెనుకాడటం లేదు. రాష్ట్రంలో చట్టంతో విభేదించిన బాలలు (జువెనైల్స్‌) పాల్పడిన నేరాలు విశ్లేషిస్తే ఇదే స్పష్టమవుతోంది. 2017లో వీరు మొత్తం 1,105 నేరాలకు పాల్పడగా...అందులో 15.59 శాతం పైన పేర్కొన్న నేరాలకు సంబంధించినివే. తమకంటే పెద్ద వయసున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడటం, రహస్య కెమెరాలతో వ్యక్తిగత దృశ్యాలు చిత్రీకరించి బెదిరించటం వంటి నేరాలకు పాల్పడుతున్నారు.
* మూల స్తంభాలు ఒరిగిపోతున్నప్పుడు పట్టించుకోకుండా అవి కూలి శిథిలమైపోతున్నప్పుడు దుఃఖిస్తే ప్రయోజనమేంటి? ఈ వాక్యం బాలల పెంపకం, వారిలో పెరిగిపోతున్న హింసాత్మక చర్యలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. తరచి చూస్తే చిన్న చిన్న అంశాలపై చిన్నారుల పట్ల చూపిన అశ్రద్ధ కారణంగా వారిలో విపరీత నేర ప్రవృత్తి పెరిగి సమాజంలో మాయని మచ్చల్ని మిగుల్చుతున్నాయి..


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు