close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చాయపెంచే చామంతి పూలు!

అందంగా కనువిందు చేసే పూలు మేని మెరుపునకూ ఎంతో మేలు చేస్తాయి. అదెలాగంటే...
* మందారపూలను కప్పు నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటికి రెండు చెంచాల తేనె కలపాలి. ఈ నీటిని క్లెన్సర్‌లా ఉపయోగించుకోవచ్చు. అలానే ఈ నీళ్లల్లో చెంచా పెసరపిండి, కాస్త పంచదార చేర్చి ముఖానికి రుద్దుకుంటే...చర్మంపై మృతకణాలు తొలగి మెరిసిపోతారు.
* చామంతి పూలను నీళ్లల్లో వేసి మరిగించాలి. ఈ నీళ్లలో చెంచా నిమ్మరసం, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేస్తే చాలు. చర్మంపై మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమవుతాయి.
* కలువ పూలను, చెంచా మెంతిగింజల్ని కొబ్బరినూనెలో వేసి మరగనివ్వాలి. తర్వాత బాదం నూనె కలిపి తలకు పట్టించాలి.  ఇలా చేస్తే జుట్టుకి తగిన పోషణ అంది ఆరోగ్యంగా కనిపిస్తుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు