close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్ట్స్‌, కామర్స్‌ విద్యార్థులకూ.. ‘గేట్‌’

అవకాశం కల్పించిన ఐఐటీలు
తొలి ఏడాదే 14,196 దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయస్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2021కు తొలిసారి ఆర్ట్స్‌, కామర్స్‌ గ్రూపు విద్యార్థులూ పోటీ పడబోతున్నారు. ఈ సారి ఐఐటీలు పలు సంస్కరణలు చేశాయి. ఇందులో భాగంగా ఆర్ట్స్‌, కామర్స్‌ విద్యార్థులు కూడా గేట్‌-2021 రాసి ఐఐటీల్లో పీజీ చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు దక్కించుకునే అవకాశాన్ని కల్పించాయి. దీంతో దేశవ్యాప్తంగా బీఏ, బీకాం గ్రూపులకు చెందిన 14,196 మంది విద్యార్థులు దరఖాస్తు చేయడం విశేషం. గేట్‌ను ఈసారి ఐఐటీ బొంబాయి నిర్వహిస్తుండగా.. ఈనెల 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆన్‌లైన్‌ పరీక్షల్లో అర్హత సాధించిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఐఐటీల్లో ఎంటెక్‌ చదవొచ్చు. ఆర్ట్స్‌, కామర్స్‌ విద్యార్థులు ఎంఏ, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరొచ్చు. మరోవైపు కొన్ని ఐఐటీలు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు