close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇంత దానం ఎవరిస్తారు?

తన కోసం కాకుండా.. నలుగురి కోసం ఆలోచించాలంటే పెద్ద మనసు కావాలి. అలాంటి మనసు తనకుందని నిరూపించుకుంది మెకంజీ స్కాట్‌. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య అయిన మెకంజీ... గత నాలుగు నెలల్లోనే సుమారు రూ.29,440 కోట్లను విరాళాలుగా అందించారు. ప్రపంచ సంపన్నుల్లో పద్దెనిమిదో స్థానంలో నిలిచిన మకెంజీ.. తన దాతృత్వంతో ఎంతోమంది హృదయాల్లోనూ స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్నారు. అమెజాన్‌లో వాటాలద్వారా ఏడాది కాలంలోనే ఆమె సంపద సుమారు మూడింతలు పెరిగింది. దాన్ని మరింత పెంచుకోవడానికి ఆలోచించకుండా విరాళాలు అందివ్వడం ఆమె గొప్పదనానికి నిదర్శనం. ‘కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయడం చాలా ముఖ్యం’ అంటారు మెకంజీ. అమెరికాలో నల్ల జాతీయులకు చెందిన 30 ఉన్నత విద్యాసంస్థలు, 40 ఫుడ్‌ బ్యాంకులకు ఈమె విరాళాలు అందించారు. పేదలకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తోన్న చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలకూ విరాళాలను అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు, తన సంపదని మరింత వేగంగా విరాళాల రూపంలో ఇవ్వడానికి సరైన ప్రణాళికలు రూపొందించమని తన సిబ్బందిని తాజాగా కోరడం మరో విశేషం.


మరిన్ని