
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి ఈనెల 23న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆఖరి విడత ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు నిర్దేశించిన సమయంలో వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.