close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈతతో.. ఉపశమనం!

అసలే వేసవి. ఆ పై భానుడి భగ భగ. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకటే ఉక్కపోత. వీటన్నిటి నుంచి ఉపశమనం పొందాలంటే చక్కగా ఈత కొట్టండి. దీనివల్ల ఉత్సాహంగా ఉండటంతో పాటు లాభాలూ ఉన్నాయి..
రోజూ ఓ గంటపాటు ఈత కొడితే శ్వాస ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలోని కొవ్వు, కెలొరీలు కరుగుతాయి. రక్తపోటు, ఒంట్లో వేడీ తŸగ్గుతాయి. ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపోతారు.
* ఈత కొట్టడం వల్ల 90 శాతం వ్యాయామం చేసినట్లు అవుతుంది. దీంతో శరీరానికి మర్దన చేసిన అనుభూతి కలుగుతుంది. మెదడు పనితీరు, జీర్ణశక్తి మెరుగుపడతాయి.
* పొట్ట తగ్గడానికి చక్కని వ్యాయామం కూడా ఈతే. కీళ్లు, కండరాలు బలపడి చక్కటి ఆకృతి సొంతం అవుతుంది.


మరిన్ని