close

తెలంగాణ

సింహం వచ్చింది.. నీళ్లు తాగింది!

గుజరాత్‌: నిత్యం రద్దీగా ఉండే రహదారిపై సింహం నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? గుజరాత్‌లోని ధరీ-ఉనా రాష్ట్ర హైవేపై ఈ అరుదైన దృశ్యం కనిపించింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు పక్కన గుంతల్లో నీళ్లు చేరాయి. ఇలాంటి ఓ నీటి గుంతలోని నీళ్లు తాగడానికి సింహం వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు వాహనదారులంతా కొద్ది దూరంలో నిలిచిపోయారు. దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిచిపోగా.. చాలామంది ఫొటోలు తీసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు