close

గ్రేటర్‌ హైదరాబాద్‌

ఇప్పటికైనా తలకెక్కుతుందా?

పోలవరం అథారిటీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘అధికారంలోకి వచ్చాం కదా.. ఏదో కాస్త హడావుడి చేద్దామనుకుంటే తప్పు లేదు. ఇల్లు పీకి పందిరేద్దామనే ఆలోచన చేయకూడదు కదా! మనకు తెలియనప్పుడు ఎవరైనా చెబితే వినాలి. కానీ వినరుగా. చివరకు ఈ రోజు పోలవరం అథారిటీ కూడా చెప్పింది. ఇప్పటికైనా తలకెక్కుతుందో లేదో ఈ మేధావులకు’ అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మంగళవారం ట్వీట్‌ చేశారు. పోలవరానికి సంబంధించి ప్రభుత్వం రివర్స్‌ టెండర్లకు వెళ్లడంపై పోలవరం అథారిటీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఈ ట్వీట్‌ చేశారు. అథారిటీ ఇచ్చిన పత్రికా ప్రకటనను దీనికి జత చేశారు.

కుడిచేతికి కట్టుతో చంద్రబాబు
తెదేపా విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుడిచేతికి కట్టుతో హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం చేయి బెణకడంతో డాక్టర్లు కట్టు కట్టారు. దీంతో సమావేశానికి కట్టుతోనే వచ్చారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పార్టీ సమావేశం ముగిసిన వెంటనే తిరిగి హైదరాబాద్‌ వెళ్లారు.

నా ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు: బాబు
తన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని, పూర్తి ఫిట్‌గా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలో ఆరోగ్య పరీక్షలు సాధారణమేనని వెల్లడించారు. మంగళవారం విజయవాడలో తెదేపా విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా చంద్రబాబు అమెరికా పర్యటన గురించి పార్టీ నేతలు ప్రస్తావించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చంద్రబాబు వారికి వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు