close

క్రీడలు

భారత్‌ అదరహో

ఫిఫా ప్రపంచకప్‌
అర్హత టోర్నీలో ఖతార్‌కు బ్రేక్‌

దిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో తనకంటే 41 స్థానాలు మెరుగ్గా ఉన్న ఖతార్‌ జట్టును నిలువరించింది. మంగళవారం దోహాలో ఖతార్‌తో జరిగిన ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 0-0తో డ్రాగా ముగించింది. ఆసియా ఛాంపియన్‌ కూడా అయిన ఖతార్‌తో మ్యాచ్‌ అంటే.. భారత్‌ ఎంత తేడాతో ఓడుతుందనే చూస్తారంతా. అలాంటిది ప్రత్యర్థికి ఒక్క గోల్‌ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను డ్రాగా ముగించడం గొప్ప ఘనతే. ఈ ఫలితంతో ఇరు జట్లకు తలో పాయింట్‌ దక్కింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ ర్యాంకు 103 కాగా.. ఖతార్‌ 62వ స్థానంలో ఉండటం గమనార్హం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు