close

సినిమా

గోపీచంద్‌తో రెండోసారి!

‘ఏమైంది ఈవేళ’తో ఆకట్టుకున్న దర్శకుడు సంపత్‌నంది. ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాలతో మాస్‌నీ మెప్పించారు. గోపీచంద్‌ని ‘గౌతమ్‌ నంద’గా చూపించారు. మరోసారి గోపీచంద్‌తో జట్టుకట్టబోతున్నారు. గోపీచంద్‌ హీరోగా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఆయన మాట్లాడుతూ ‘‘గోపీచంద్‌ ఇమేజ్‌కి తగిన కథ కుదిరింది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామ’’న్నారు. సమర్పణ: పవన్‌ కుమార్‌.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు