close

సినిమా

‘మూగమనసులు’ 2020

అక్కినేని - సావిత్రిల సూపర్‌ హిట్‌ చిత్రం ‘మూగమనసులు’. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పాటలన్నీ హిట్టే. ఇప్పుడు ఈ టైటిల్‌ మరోసారి పోస్టర్లపై కనిపించనుంది.  నాగశౌర్య కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం  అవుతున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభిస్తారు. 2020 మేలో విడుదల చేస్తారు. ఈ చిత్రానికి ‘మూగమనసులు’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు