close

ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో సహాయ కార్యదర్శుల బదిలీ

సెక్రటేరియేట్‌ అసోసియేషన్‌ అభ్యంతరం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సహాయ కార్యదర్శులను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 18 మంది సహాయ కార్యదర్శుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం జులై 10నే ఉత్తర్వులు (జీవో నెం.1574) ఇచ్చింది. బదిలీల తీరుపై అభ్యంతరాలు రావడంతో ఆ జీవోని నిలిపివేసింది. ఆ జీవోనే యథాతథంగా అమలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియేట్‌ అసోసియేషన్‌ అభ్యంతరం తెలిపింది. సచివాలయంలోని వివిధ విభాగాల మధ్య ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం రూపొందించిన విధానానికి ఇది విరుద్ధమని అసోసియేషన్‌ అధ్యక్షుడు యు.మురళీకృష్ణ తదితరులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు