close

ఆంధ్రప్రదేశ్

వైద్యవిద్యలోనూ తెలుగు గుబాళింపు

వైద్య కళాశాలల్లో సాధారణంగా వైద్య విద్యపై పాఠాలు చెబుతూ.. రోగుల చికిత్స తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. గత సంవత్సరం నవంబరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో విద్యార్థులకు తెలుగుభాషపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోగుల మాతృ భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా తెలుగు భాషపై వైద్య విద్యార్థులకు పట్టును పెంచుతున్నారు. తిరుపతిలోని ప్రభుత్వ శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో ఫోరెన్సిక్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సేపూరి రామ్‌మోహన్‌ ఇందులో భాగస్వాములవుతున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో తరగతులకు హాజరవుతూ విద్యార్థులకు తెలుగు భాష, సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నారు.

- ఈనాడు, తిరుపతి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు