close

తెలంగాణ

రేషన్‌ డీలర్లకు రూ.30 వేల గౌరవ వేతనం చెల్లించాలి

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రేషన్‌ డీలర్లకు నెలకు రూ.30 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఆరోగ్య కార్డులను అందజేయాలని, కారుణ్య నియామకాలను సకాలంలో పూర్తి చేయాలని విన్నవించింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి అన్ని జిల్లాల నుంచి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, డీలర్లు హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌ బాబు మాట్లాడుతూ.. అన్ని డీలర్ల సంఘాలకు కలిపి ఏక నాయకత్వ ఎన్నిక నిర్వహించాలని కోరారు. తమ సమస్యలను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని విజ్ఞప్తి చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు