close

తెలంగాణ

యోగా నిత్యకృత్యం కావాలి

గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి ఒక్కరికి యోగా నిత్యకృత్యం కావాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు యోగా శిక్షణ తరగతులను గురువారం ఉదయం ఆమె ప్రారంభించారు. గవర్నర్‌ దంపతులు ఇందులో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, సమాజంలో చాలామంది శారీరక శ్రమను తగ్గించారని, నడక కూడా మానేశారని అన్నారు. ప్రధానమంత్రి పిలుపు ఇచ్చిన దారుఢ్య భారత్‌ ఉద్యమానికి బలం చేకూర్చేలా నిత్యం అందరూ యోగా చేయాలన్నారు. రాజ్‌భవన్‌ పాఠశాలలోనూ యోగా తరగతులు ప్రారంభించామన్నారు. గవర్నర్‌ తమిళిసైతో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లక్సెంబర్గ్‌ రాయబారి జీన్‌ క్లాడ్‌ కుగెనర్‌, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తదితరులు గవర్నర్‌ను కలిశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు