close

సినిమా

వినోదాత్మక కథతో

రవితేజ కథానాయకుడిగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా  తెరకెక్కబోతుంది. హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘‘రమేష్‌ వర్మ దర్శకత్వంలో మేంనిర్మించిన ‘రాక్షసుడు’ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడాయన రవితేజ కోసం చక్కని స్క్రిప్ట్‌ రాసుకున్నారు. వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక కథగా చిత్రాన్ని రూపొందించనున్నాం. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు