close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరదొచ్చెనంటే కలువొచ్చినట్లే!

చిత్రాలను చూస్తుంటే నీళ్లలో కలువ పూలను అందంగా పేర్చి ఫొటోలు దిగినట్లుంది కదూ. నిజానికి ఇక్కడ చేస్తున్నది వ్యవసాయం. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు, వియత్నాంలోని మెకాంగ్‌ నది- తీర ప్రాంతాలను వరదల్లో ముంచెత్తుతుంటుంది. పంట పొలాలు కూడా చెరువుల్ని తలపిస్తుంటాయి. ఎక్కడైనా వరదలంటే నష్టమే. వియత్నాంలోనూ అంతే. కానీ అక్కడి లాంగ్‌ ఎన్‌ ప్రావిన్స్‌ వాసులకు మాత్రం ఆ వరదలు అదృష్టంగా మారుతుంటాయట. ఎందుకంటే, వేగంగా వచ్చే నీటితో పాటు తెలుపూ గులాబీ రంగు కలువ మొక్కలూ గుట్టలుగా కొట్టుకొచ్చి పంట పొలాల్లోనూ చిన్న చిన్న కొలనులూ చెరువుల్లోనూ చేరుతుంటాయి. అవి సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకూ విరగపూస్తుంటాయట. రైతులు పగలంతా ఎంతో కష్టపడి ఈ కలువ పంటను సేకరిస్తుంటారు. ఈ సేద్యాన్నే ట్రంగ్‌ హుయ్‌ ఫమ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ ఇంతందంగా తన కెమేరాలో బంధించాడు. వియత్నాంలో కలువ పూలను అలంకరణకూ టీ తయారీకీ ఎక్కువగా వాడతారు. వీటి కాడలనూ బాగా తింటారు. అందుకే, వరదల సమయంలో వారికి ఈ పువ్వులు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాదు, రంగు రంగుల్లో వికసించిన పువ్వులతో కనువిందుగా ఉండే లాంగ్‌ ఎన్‌ ప్రావిన్స్‌ ఈ మూడు నెలలూ పర్యటక ప్రాంతంగానూ మారిపోతుంది. అలానూ ఆదాయమే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు