close

తాజా వార్తలు

దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి ప్రచార కష్టాలు

నాలుగు గంటల పాటు రైల్లో చిక్కుకున్న సిరిల్‌ రమఫోసా

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో మాదిరిగానే దక్షిణాఫ్రికాలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆదేశంలోని రాజకీయనేతలందరూ ప్రచార బాట పట్టారు. ఈ క్రమంలో ఆదేశ అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా కూడా ప్రచారానికి వెళ్లారు. భారీ మెజార్టీతో గెలుపొందాలనే లక్ష్యంలో భాగంగా రమఫోసా మారు మూల ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మబోపనే ప్రావిన్సులో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా రైల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లగా ఆయన వెళ్లాల్సిన రైలు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. ప్రిటోరియా ప్రావిన్సులో ప్రచారం చేయడానికి ఆ రైలును ఎక్కారు. ఆ రైలు కొద్ది దూరం ప్రయాణిచాక గౌతెంగ్‌ అనే  రైల్వస్టేషన్‌ వద్ద ఆగిపోయింది. సాంకేతిక లోపం తెలెత్తడంతో నాలుగు గంటల పాటు రమఫోసా ఆ రైల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రిటోరియాకు 45నిమిషాల్లో వెళ్లాల్సింది పోయి నాలుగు గంటలు పట్టింది.

ఈ మధ్యలో రైలులో ఉండే ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. రైళ్ల పరిస్థితి ప్రతిరోజూ ఇంతేనని అధ్యక్షుడి ముందే ప్రయాణికులు తమ అక్కసునంతా వెళ్లగక్కారు. రమఫోసా వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. దేశంలో రైల్వే వ్యవస్థ దారుణంగా తయారైందని ప్రయాణికులు ఫిర్యాదు చేయడాన్ని రమఫోసా తీవ్రంగా తీసుకున్నారు. దీనికి తోడు అధ్యక్షుడికే అనుభవంలోకి రావడంతో రైళ్లన్నీ సమయానికి నడపాలని లేకపోతే కఠినచర్యలు తీసుకుంటామని  గట్టిగా హెచ్చరించారు.దక్షిణాఫ్రికాలో మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు