close

ఆంధ్రప్రదేశ్

123 అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థుల ఖరారు 

ఆరుగురు మహిళలకు టికెట్ల కేటాయింపు 
విశాఖ నార్త్‌ నుంచి విష్ణుకుమార్‌రాజు.. బద్వేలుకు జయరాములు

ఈనాడు, అమరావతి: భాజపా 123 శాసనసభ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ప్రస్తుత శాసనసభలో భాజపాకు నలుగురు ఎమ్మెల్యేలుండగా..వారిలో ఇద్దరు మాత్రమే పోటీలో ఉన్నారు. విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు పేరు ఈ జాబితాలో లేదు. ఆయన్ని నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరినట్లు తెలిసింది. ఆయన తాడేపల్లిగూడెం శాసనసభ నుంచి పోటీ చేసేందుకు మాత్రమే ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం నగరం నుంచి పోటీచేసి విజయం సాధించిన ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రాజమహేంద్రవరం లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. 123 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన జాతీయ నాయకత్వం మలివిడతలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. జాబితాలో ఆరుగురు మహిళలకు టికెట్లు కేటాయించగా.. వారిలో సినీనటి పసుపులేటి లతా మాధవి ఉన్నారు. ఆమెకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారు. కడప జిల్లా బద్వేలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే జయరాములు గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలుపొందగా.. అనంతరం తెదేపాలో చేరారు. ఆపార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇటీవల భాజపాలో చేరగా.. బద్వేలు స్థానం కేటాయించింది. పార్టీ సీనియర్‌ నేత కందుల రాజమోహనరెడ్డి కడప శాసనసభ స్థానం పోటీ చేయనున్నారు.

ఏపీలో 123 అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులు వీరే 
(నియోజకవర్గం అభ్యర్థి పేరు)

శ్రీకాకుళం  
ఇచ్ఛాపురం జేఎస్వీ ప్రసాద్‌ 
టెక్కలి హనుమంతు ఉదయ్‌భాస్కర్‌ 
పాతపట్టణం రాఘవరావు ఎస్‌ 
శ్రీకాకుళం చల్లా వెంకటేశ్వరరావు 
ఎచ్చెర్ల సూర్యప్రకాష్‌ రొక్కం 
రాజాం(ఎస్సీ) చైతన్యకుమార్‌ ఎం 
పాలకొండ(ఎస్టీ) టి.సునీత
విజయనగరం  
కురుపాం(ఎస్టీ) జయరాజు నిమ్మక 
పార్వతీపురం(ఎస్సీ) ఎస్‌.ఉమమాహేశ్వరరావు 
సాలూరు(ఎస్టీ) కె.ఉదయ్‌కుమార్‌ 
బొబ్బిలి డాక్టర్‌ ద్వారపురెడ్డి రామ్మోహన్‌ 
చీపురుపల్లి శంకరలాల్‌శర్మ డి 
నెల్లిమర్ల రమణ పతివాడ 
శృంగవరపుకోట రామకృష్ణ ప్రసాద్‌ చల్లా
విశాఖపట్టణం  
భీమిలి రవీందర్‌రెడ్డి మేడపాటి 
విశాఖపట్నం సౌత్‌ కాశీ విశ్వనాధ్‌రాజు  
విశాఖపట్నం నార్త్‌ విష్ణుకుమార్‌ రాజు 
విశాఖపట్నం వెస్ట్‌ బుద్దా చంద్రశేఖర్‌ 
గాజువాక పులుసు జనార్దన్‌ 
అరకు వ్యాలీ(ఎస్టీ) ఉమామహేశ్వర్‌రావు కురస 
పాడేరు(ఎస్టీ) గాంధీ లోకుల 
అనకాపల్లి అప్పారావు పొన్నగంటి 
పెందుర్తి సత్యనారాయణ కేవీవీ 
యలమంచిలి మైలపల్లి రాజారావు 
పాయకరావుపేట(ఎస్సీ) కాకర నూకరాజు 
నర్సీపట్నం శ్రీనివాస్‌ గాదె
తూర్పుగోదావరి  
ప్రత్తిపాడు రామ్‌కుమార్‌ చిలుకూరు 
పిఠాపురం రామేశ్వర్‌రెడ్డి బిల్లకుర్తి 
కాకినాడ గ్రామీణం భీమాశంకర్‌ కవికొండల 
పెద్దాపురం రామ్‌కుమార్‌ యార్లగడ్డ 
అనపర్తి హరినారాయణరెడ్డి మేడపాటి 
కాకినాడ నగరం రవికిరణ్‌ పెద్దిరెడ్డి 
రామచంద్రపురం శంకరనారాయణ మూర్తి దూడల 
ముమ్మిడివరం కర్రి చిట్టిబాబు 
అమలాపురం(ఎస్సీ) డాక్టర్‌ పెయ్యల శ్యామ్‌ప్రసాద్‌ 
రాజోలు(ఎస్సీ) బత్తుల లక్ష్మీకుమారి 
పి.గన్నవరం(ఎస్సీ) అయ్యాజీ వేమా మానేపల్లి 
కొత్తపేట సత్యానందం పాలూరి 
మండపేట డాక్టర్‌ కోనా సత్యనారాయణ 
రాజానగరం చౌదరి ఏపీఆర్‌ 
రాజమండ్రి నగరం దత్తు బొమ్ముల 
జగ్గంపేట లక్ష్మీ సూర్యనారాయణ రాజు
పశ్చిమగోదావరి  
కొవ్వూరు(ఎస్సీ) బూసి సురేంద్రనాథ్‌ బెనర్జీ 
నిడదవోలు లింగంపల్లి వెంకటేశ్వరరావు 
ఆచంట ఏడిద కోదండ చక్రపాణి 
పాలకొల్లు రావూరి లక్ష్మణస్వామి 
నర్సాపురం అకుల లీలాకృష్ణ 
ఉండి అల్లూరి వెంకట  
సత్యనారాయణరాజు 
తణుకు మల్లిన రాధాకృష్ణ 
దెందులూరు యలమర్తి బాలకృష్ణ 
ఏలూరు నాగం చంద్ర నాగశివప్రసాద్‌ 
చింతలపూడి(ఎస్సీ) యడ్లపల్లి దుర్గారావు
కృష్ణా  
తిరువూరు(ఎస్సీ) పోలే శాంతి 
నూజివీడు మరిడి కృష్ణ 
గుడివాడ గుత్తికొండ రాజాబాబు 
పెడన మట్టా ప్రసాద్‌ 
పామర్రు(ఎస్సీ) వలపర్ల వెంకటేశ్వరరావు 
విజయవాడ పశ్చిమ దేశాయ్‌ పియూష్‌ 
విజయవాడ సెంట్రల్‌ సత్యమూర్తి వామరాజు 
మైలవరం నూతలపాటి బాల కోటేశ్వరరావు 
నందిగామ(ఎస్సీ) జంగం సునీల్‌రాజు 
జగ్గయ్యపేట అన్నెపాడ ప్రపుల్లా శ్రీకాంత్‌
గుంటూరు  
తాడికొండ(ఎస్సీ) ఆనంద బాబు. ఎస్‌ 
మంగళగిరి జగ్గారపు రాంమోహన్‌రావు 
పొన్నూరు సీహెచ్‌. విజయభాస్కర్‌రెడ్డి 
వేమూరు(ఎస్సీ) శ్రీనివాస్‌ దర్శనపు 
తెనాలి రామకృష్ణ పాటిబండ్ల 
ప్రత్తిపాడు(ఎస్సీ) డాక్టర్‌ చల్లగాలి కిశోర్‌ 
గుంటూరు పశ్చిమ పసుపులేటి లతా మాధవి 
గుంటూరు తూర్పు సురేష్‌ నేరళ్ల 
చిలకలూరిపేట అన్నం శ్రీనివాసరావు 
సత్తెనపల్లి మద్దాల కృష్ణంరాజు యాదవ్‌ 
వినుకొండ నల్లబోలు వెంకట్రావు
కడప  
బద్వేల్‌(ఎస్‌సీ) టి.జయరాములు 
రాజంపేట రమేష్‌నాయుడు పోతుగుంట 
కడప కందుల రాజమోహన్‌రెడ్డి 
కోడూరు(ఎస్‌సీ) పంతల సురేష్‌ 
రాయచోటి పి.శ్రీనివాసకుమార్‌ రాజు 
జమ్మలమడుగు రవి సూర్య రాయల్‌ జడ 
పొద్దుటూరు కె.బాలచంద్రరెడ్డి 
మైదుకూరు పీవీ ప్రతాప్‌రెడ్డి
నెల్లూరు  
కావలి కందుకూరి సత్యనారాయణన్‌ 
ఆత్మకూరు కర్నాటి ఆంజనేయరెడ్డి 
కోవూరు డాక్టర్‌ మారం విజయలక్ష్మి 
నెల్లూరు నగరం కె.జగన్‌మోహన్‌రావు 
సూళ్లూరుపేట(ఎస్‌సీ) రత్నం దాసరి  
ఉదయగిరి గుండ్లవల్లి భరత్‌కుమార్‌
ప్రకాశం  
దర్శి యేరువ లక్ష్మీనారాయణరెడ్డి 
పర్చూరు చెరుకూరి రామయోగేశ్వరరావు 
సంతనూతలపాడు(ఎస్సీ) నన్నెపోగు సుబ్బారావు 
ఒంగోలు ఆంజనేయులు బొద్దులూరి 
కొండపి(ఎస్‌సీ) కరతపు రాజు 
మార్కాపురం మర్రిబోయిన చిన్నయ్య 
కనిగిరి పీవీ కృష్ణారెడ్డి
కర్నూలు  
ఆళ్లగడ్డ శూలమ్‌ రామకృష్ణుడు 
శ్రీశైలం డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి బుడ్డా 
కర్నూలు వెంకట సుబ్బారెడ్డి 
కోడుమూరు(ఎస్‌సీ) మీసాల ప్రేమ్‌కుమార్‌ 
ఎమ్మిగనూరు కేఆర్‌ మురహరిరెడ్డి 
మంత్రాలయం జెల్లి మధుసూదన్‌ 
ఆదోని కునిగిరి నీలకంఠ 
ఆలూరు కోట్ల హరి చక్రపాణిరెడ్డి
అనంతపురం  
రాయదుర్గం బీజే వసుంధరా దేవి 
ఉరవకొండ శ్రీనివాసులు కొత్త 
గుంతకల్లు హరిహరనాధ్‌ పసుపుల 
తాడిపత్రి జె.అంకల్‌రెడ్డి 
సింగనమల(ఎస్‌సీ) సీసీ వెంకటేష్‌ 
అనంతపురం నగరం జె.అమర్‌నాథ్‌ 
కళ్యాణదుర్గం ఎం.దేవరాజు 
రాప్తాడు యెర్రి స్వామి 
మడకశిర(ఎస్‌సీ) హనుమంత రాయప్ప
చిత్తూరు  
తంబళ్లపల్లి డి.మంజునాథ్‌రెడ్డి 
పీలేరు పులిరెడ్డి నరేంద్రకుమార్‌రెడ్డి 
మదనపల్లె ఆనంద్‌ బండి 
పుంగనూరు గన్న మదన్‌మోహన్‌ బాబు 
చంద్రగిరి పి.మధుబాబు 
శ్రీకాళహస్తి కోల ఆనందకుమార్‌  
సత్యవేడు(ఎస్‌సీ) ఎస్‌.వెంకటయ్య 
గంగాధర నెల్లూరు(ఎస్‌సీ) పి.రాజేంద్రన్‌ 
చిత్తూరు వి.జయకుమార్‌ 
పూతలపట్టు(ఎస్‌సీ) భానుప్రకాశ్‌ 
పలమనేరు పీసీ.ఈశ్వర్‌రెడ్డి 
కుప్పం ఎన్‌.ఎస్‌.తులసినాథ్‌

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు