close

ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ప్రత్యేక రాష్ట్రానికి పోరాడాలి

ప్రజల అభీష్టం మేరకు కొత్త పార్టీ!
సీనియర్‌ నేత  మైసూరా రెడ్డి వెల్లడి

కడప (నాగరాజుపేట), న్యూస్‌టుడే: రాయలసీమ అభివృద్ధికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్‌ నేత మైసూరా రెడ్డి అన్నారు. ఆదివారం కడపలో గ్రేటర్‌ రాయలసీమ ఏర్పాటుపై ఆసక్తిగల వారితో రాయలసీమ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం కాకుండా ప్రాంత అభివృద్ధి కోసమే సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర్రం సాధించేందుకు పోరాడాలన్నారు. ప్రజల అభీష్టం మేరకు ప్రత్యేక పార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందన్నారు. సీమను అభివృద్ధి చేసేందుకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డి, విశ్రాంత సీఈ శ్రీరాంరెడ్డి, రాయలసీమ నీటి సాధన సమితి నాయకులు దశరాథరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శివరామక్రిష్ణా రావు, జగదీష్‌, మధన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు