close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గుడ్డుతో జుట్టు పెరుగు

మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యం, జుట్టు, చర్మంపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి  చర్మం తాజాగా, కాంతిమంతంగా ఉండాలన్నా... జుట్టు కుదుళ్లు బలంగా  మారాలన్నా... పోషకాలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాల్సిందే. అవేంటో తెలుసుకోండి మరి.
గుడ్లు, పెరుగు: వీటిలో మాంసకృత్తులు, విటమిన్‌-బి5 పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆ పోషకాలన్నీ లభిస్తాయి. అంతేకాదు మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం, పల్చబడటం వంటి సమస్యలు తగ్గుతాయి.

జామ: దీనిలోని విటమిన్‌-సి జుట్టుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా చివర్లు చిట్లకుండా కాపాడుతుంది.

సాల్మన్‌: ఈ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. మెరిసేలా చేస్తాయి. ఒమేగా-3 ఆమ్లాలు జుట్టు పొడిబారకుండా, ఎండిపోయి గడ్డిలా మారకుండా చూస్తాయి

దాల్చిన చెక్క: ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కుదుళ్లకు పోషణను చేకూరుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్క పొడిని మీ ఆహారంలో చేర్చుకోండి.

పప్పులు: వీటిలోని మాంసకృత్తులు, ఇనుము జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

చిలగడ దుంప: ఇందులో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ మాడుపై తైలగ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో మీ జుట్టు కాంతిమంతంగా కనిపిస్తుంది.
బాదం: వీటిలో పీచు, మాంస కృత్తులు, అధిక మొత్తంలో మాంగనీస్‌, సెలీనియం మూలకాలు ఉంటాయి. ఇవి మీ జుట్టును మెరిపించడంతోపాటు బలంగా మారుస్తాయి.


మరిన్ని